ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీమంత్రి శైలజానాథ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసిరెడ్డి, మస్తాన్ వలీలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఎనిమిది నెలల తర్వాత రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
అధిష్ఠానం నిర్ణయంపై శైలజానాథ్ వ్యాఖ్యలు
అధిష్ఠానం ప్రకటన అనంతరం... శైలజానాథ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో.. కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తెచ్చేందుకు అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని శైలజానాథ్ తెలిపారు. ఇతర పార్టీలకు వెళ్లిన క్యాడర్ తిరిగివచ్చేలా కృషి చేస్తానన్నారు. బాధ్యతలు తీసుకున్నాక రాజధాని, ఇతర అంశాలపై స్పందిస్తానన్నారు.