ETV Bharat / state

జగన్ ముఖ్య కార్యదర్శిని తప్పించాలని సీఎస్​కు ఎస్‌ఈసీ లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్​​ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్​కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ap sec-orders-to-cs-on-removal-of-principle-secretary-of-government-from-electoral-duties
జగన్ ముఖ్య కార్యదర్శిని తప్పించాలని సీఎస్​కు ఎస్‌ఈసీ లేఖ
author img

By

Published : Jan 29, 2021, 3:02 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్​​ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వైకాపా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్​కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని, వేరే ఏదైనా శాఖకు బదిలీ చేయాలని సీఎస్​ను ఆదేశించారు. తను సిఫార్సు లేఖలు పంపినా.. స్పందించని పలువురు ఉద్యోగులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని లేఖలో తెలిపారు.

తన ఆదేశాలను పట్టించుకోలేదని..

ఈ నెల 23న కలెక్టర్లు, ‌ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని లేఖలో ఆరోపించారు. జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో వెల్లడించారు. ఈ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 25న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని లేఖలో వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏం టేస్ట్ గురూ... కల్లు తాగిన మంత్రులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.