ETV Bharat / state

'ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు' - ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యద్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్... విధుల నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా తప్పిదాలకు పాల్పడ్డారని ఎస్ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్.. సెన్సూర్ ప్రోసిడింగ్స్ ను జారీ చేశారు. ఎన్నికల కమిషన్ పేర్కొన్న అభియోగాలు వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా ప్రోసిడింగ్స్ జారీ చేశారు.

ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు: ఏపీ ఎస్ఈసీ

author img

By

Published : Jan 26, 2021, 5:34 PM IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా విధినిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్​లపై చర్యలు తీసుకుంటూ ఎస్​ఈసీ సెన్సూర్ ప్రోసిడింగ్స్ ను జారీ చేశారు. విధి నిర్వహణలో ఉద్దేశపూర్వక ఉల్లంఘనలకు పాల్పడినందుకుగానూ వారిపై నిందారోపణ చేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చారు. తమకు సంక్రమించిన విధుల్ని నిర్వర్తించకుండా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన అంశాలను పేర్కొంటూ ఈ అభియోగాలు వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా ఎస్ఈసీ రమేశ్​ కుమార్ ఆదేశించారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ నెల 23న నోటిఫికేషన్​ విడుదల సమయంలో చెప్పిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

అందుకు ఇద్దరి తీరే కారణం...

పంచాయతీ ఎన్నికల్లో 2021 ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ .. తప్పనిసరి పరిస్థితుల్లో 2019 జాబితాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ఇద్దరు అధికారులు మాత్రమే కారణమని ఎస్ఈసీ ఈ ప్రొసిడింగ్స్​లో పేర్కొన్నారు. కమిషన్ పదే పదే పంచాయతీరాజ్ శాఖకు ఈ అంశంపై అధికారికంగా సమాచారం పంపినా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన కారణంగా 2021 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోలేని దుస్థితి ఏర్పడిందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి తాజా ఓటర్ల జాబితాను సిద్ధం చేయటంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఘోరంగా విఫలమయ్యారని పేర్కొంది. ఇద్దరు ఉన్నతాధికారులు చేసిన తప్పిదాలను, జరిగిన పరిణామాలన్నింటినీ విశదీకరిస్తూ 8 పేజీల ప్రొసీడింగ్స్​ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ జారీ చేశారు. రాజ్యాంగంలో ప్రతీ పౌరుడికీ లభించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా... ద్వివేది, గిరిజా శంకర్​ వ్యవహరించారని పేర్కొన్నారు.

అన్నీ తెలిసినప్పటికీ...

గోపాల కృష్ణ ద్వివేదీ గతంలో ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారని... ఎన్నికల నియమాల గురించి బాగా తెలిసినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఎస్ఈసీ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ విభాగ అధిపతిగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను ఎన్నికల కోసం సమన్వయం చేసుకోవాల్సి ఉండగా.. ఆ పని చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ప్రొసీడింగ్స్​లో ఎస్​ఈసీ వివరించారు.

పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్​గా ఉన్న గిరిజా శంకర్ కూడా తన చర్యల ద్వారా కమిషన్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఎస్ఈసీ ఆక్షేపించారు. ఇరువురి అధికారుల తరఫున ఇది ఘోరమైన వైఫల్యంగా భావిస్తున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ద్వారా గ్రామీణ పాలనా వ్యవస్థలు ఉన్నతస్థితికి చేరే అవకాశం ఉంటుందని ఆ బాధ్యతల్ని నిర్వహించటంలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారిగా గిరిజా శంకర్ అనర్హులని భావిస్తున్నట్టు కమిషన్ ప్రోసీడింగ్స్ లో పేర్కొంది. చేసిన తప్పిదాలన్నింటినీ ఇద్దరు అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఈ ప్రోసీడింగ్స్​ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్​తో పాటు అఖిల భారత సర్వీసు అధికారులు, పర్యవేక్షణ బాధ్యతలు చూసే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఎస్ఈసీ పంపించారు.

ఇదీ చూడండి: కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.