ETV Bharat / state

AP PRC: 'బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌...కప్పు తెమ్మంటే చిప్పతెచ్చారు'

AP PRC Memes: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఆనందం కలిగించిందా? ఆగ్రహం రగిలించిందా? అన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

AP PRC memes
ఏపీలో పీఆర్సీపై సామాజిక మాధ్యలలో పోస్టులు
author img

By

Published : Feb 7, 2022, 9:54 AM IST

AP PRC Memes: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఆనందం కలిగించిందా? ఆగ్రహం రగిలించిందా? అన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందేశాలనిండా పీఆర్సీ అంకంలో ప్రభుత్వం తరఫున కీలకంగా వ్యవహరించిన నాయకుడితో పాటు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన నలుగురే లక్ష్యంగా కన్పిస్తున్నారు. కొన్ని పోస్టుల్లో ఆగ్రహావేశాలు శ్రుతి మించుతున్నాయి. ‘ఉన్నారా, విన్నారా’ అంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. మీమ్‌లు, సినిమా క్లిప్పింగ్‌లను సందర్భానుసారంగా జోడిస్తున్నారు. ఆయా పాత్రలకు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రభుత్వ పెద్దల పేర్లు పెడుతూ పోస్టులు వదులుతున్నారు. బాగా చక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టులు ఇవీ.

ఈ చర్చలు సఫలమా?

  • ‘సీపీఎస్‌ రద్దు లేదు, ఫిట్‌మెంట్‌ పెరుగుదల లేదు, అశుతోష్‌ మిశ్రా నివేదిక లేదు, పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు లేవు. చివర్లో చర్చలు సఫలం’ అంటూ ఆవేదనతో చిత్రం.
  • నలుగురు నాయకుల ఫొటోలపై కొట్టివేత గుర్తుపెట్టి.. ‘చీకటి నాయకులు, చీకటి ఒప్పందాలు’ అంటూ కింద వ్యాఖ్య.
  • ‘ఫ్యాప్టో అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైర్‌ తగ్గేదేలే అంటిరి! మరి నేడు జేఏసీ నాయకుల చేతిలో ఫ్లవర్‌ (ఫ్యాప్టో) నలిగిపోయింది. ఇక ఫ్లవర్‌ చెవిలో పెట్టుకుని చెక్క భజన, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసుకోవడమే.’ ఇది ఉపాధ్యాయ సంఘాల్లో తిరుగుతున్న పోస్టు.
  • ‘13 లక్షల మందిని నమ్మించి గొంతు కోసినందుకు బహుమతి ప్రకటించిన ప్రభుత్వం. సలహాదారులుగా ఆ నలుగురు నియామకం’, ‘మంత్రుల కమిటీ దెబ్బకు బోర్లా పడ్డ స్టీరింగ్‌ కమిటీ!’ ‘ఈ పీఆర్సీలో తేలిందేమిటంటే ఉన్నవి తీసేస్తే కొత్తవి అడగరు. తీసేసినవే ఇమ్మని అడుగుతారు’. ‘ఉద్యోగ సంఘాల నాయకుల చాకచక్యంతో ప్రభుత్వ టీం ఘనవిజయం సాధించింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు.

కప్పు తెమ్మంటే చిప్ప తెచ్చారే?

  • ‘విజయవాడలో ట్రైనింగ్‌ ఇచ్చి పంపాం కదా. కప్పు తెమ్మంటే చిప్ప తెచ్చారేంటి?’ అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖచిత్రంతో..
    AP PRC memes
    కప్పు తెమ్మంటే చిప్పతెచ్చారు
  • ఓ మహిళ తన భర్తను కొడుతున్న వీడియో పోస్టు చేసి ‘ఎగరేసుకుని చలో విజయవాడ అంటూ ముందురోజే వెళ్లిపోయారు. ఏం సాధించారు? ఇంకోసారి ర్యాలీలు, మీటింగ్లు, గట్రా అంటే..’ అంటూ వ్యాఖ్యల జోడింపు.
  • ‘బతకడానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఏమన్నా సాధించుకురండిరా అంటే చచ్చాక మట్టి ఖర్చులు సాధించుకువచ్చారు మన..’ (అభ్యంతరకర పదం)
  • ‘ఆ ఒక్కరికి ఇప్పుడు మరో నలుగురు సలహాదారులు తయారయ్యారు’ అంటూ సచివాలయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఉద్యోగ సంఘాల నాయకుల ఫొటోతో.
  • 'సుదీర్ఘ చర్చల అనంతరం చివరికి సాధించింది ఇదే!’ అంటూ ఓ చిప్ప ఫొటో.
  • ‘ఉద్యోగులకు నచ్చని పీఆర్సీ ఇచ్చి కూడా సంఘాల నేతలతో ఆయన రెండుసార్లు అభినందనలు చెప్పించుకున్నారు. సంఘాల నేతలు సీఎంను ఎప్పుడైనా కలిశారా అంటే అది అభినందనలు చెప్పేందుకే! తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్కారు ప్రతిపాదనలకు అంగీకరించామని చెబుతున్న నేతలు అన్నిసార్లూ అభినందనలు చెప్పాలా?’ అంటూ ప్రశ్నలు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
'బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌
memes

'బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌

  • బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అంటూ అఖండ చిత్ర ఫొటోతో పలు వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
  • మేము అడిగింది ఫిట్‌మెంట్‌. మీరు చేస్తామంటున్నది సెటిల్‌మెంట్‌.
  • మేము అడిగింది హౌస్‌ రెంటు. మీరు ఇస్తామంటుంది టెంట్హౌస్‌ రెంట్‌.
  • మేము అడిగింది మిశ్రా రిపోర్టు. మీరు ఇచ్చింది సీఎస్‌ రిపోర్టు.
  • మేము అడిగింది పీఆర్సీ. మీరు ఇస్తామంటున్నది రివర్స్‌ పీఆర్సీ.
  • మేము అడిగింది సీపీఎస్‌ రద్దు. మీరు చేసింది చింతామణి రద్దు.

ఇదీ చదవండి: Delay in agricultural loans : రుణం అందడం లేదు... "సాగు" సాగడంలేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.