ఏపీఎస్ఆర్టీసీని బతికించాలన్నదే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముఖ్య ఉద్దేశమని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కాస్త ఇబ్బందులు తలెత్తినా... ఆర్టీసీకి వచ్చే రాబడిలో పెద్ద తేడా ఉండదని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు సొంత వాహనాల్లో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో బస్సులు తిరగకపోవడం కంటే కొవిడ్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువని వివరించారు. ఆర్టీసీ... ప్రజా-ప్రభుత్వం చేతిలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్ని పేర్కొన్నారు. సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా చూస్తున్నామన్నారు. డిమాండ్‌ను బట్టి అన్ని రూట్లలో బస్సులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఎట్టకేలకు సరిహద్దు దాటిన బస్సుచక్రం