ETV Bharat / state

ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?: ఏపీ హైకోర్టు

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టు మండిపడింది. ఆంధ్రప్రదేశ్​ రాజధాని ప్రాంత రైతులను ఎస్సీ , ఎస్టీ కేసులో జైలుకు పంపిన పోలీసుల తీరును తప్పుబట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని స్పష్టం చేసింది. ఏడుగురు రాజధాని రైతులకు బెయిలు మంజూరు చేసింది.

ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?: ఏపీ హైకోర్టు
ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?: ఏపీ హైకోర్టు
author img

By

Published : Nov 12, 2020, 7:49 AM IST

ఏపీ రాజధాని ప్రాంతంలోని ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపిన పోలీసుల తీరును ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు. వారిపై పెట్టిన మిగిలిన సెక్షన్లన్నీ బెయిలు ఇవ్వదగినవే. అలాంటప్పుడు నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారు. నిందితులను రిమాండుకు పంపే విషయమై నిబంధనలను పాటించడంలో న్యాయాధికారి కూడా విఫలమయ్యారు. నిందితులను యాంత్రికంగా రిమాండుకు పంపడానికి వీల్లేదు. ఈ వ్యవహారంపై డీజీపీ పర్యవేక్షణలో.. దర్యాప్తు అధికారి/మంగళగిరి డీఎస్పీ, గుంటూరు గ్రామీణ ఎస్పీ రెండు వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలి. నిందితులను రిమాండుకు పంపిన మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, బెయిలు పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు నాలుగో అదనపు సెషన్స్‌ ప్రత్యేక జడ్జి కూడా నివేదికలు సమర్పించాలి’’ అని ఆదేశించింది. రాజధాని రైతులు ఏడుగురికీ బెయిలు మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

మూడు రాజధానులకు అనుకూలంగా గత నెల 23న తాళ్లాయపాలెం వెళ్తున్నవారిపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించారనే ఆరోపణతో రాజధాని ప్రాంత రైతులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల కొట్టేసింది. రైతులు కుక్కమళ్ల అమర్‌బాబు, నంబూరు రామారావు, ఈపూరి రవికాంత్‌, ఈపూరి సందీప్‌ మరియదాసు, ఈపూరి కిశోర్‌, సొంటి నరేశ్‌, దానబోయిన బాజీ హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ‘ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడానికి వీల్లేదు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఐదుగురు ఎస్సీలు. అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్‌ తప్ప మిగిలినవన్నీ బెయిలు ఇవ్వదగినవే. తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారు ఫిర్యాదులో పేర్కొనలేదు. కులదూషణ జరగలేదని ఆయనే చెబుతున్నారు. బెయిలు పిటిషన్‌పై విచారణ చేసిన గుంటూరు కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు’ అని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ ప్రమాణపత్రాన్ని గుంటూరు కోర్టు పరిగణలోకి తీసుకోలేదా? అని ప్రశ్నించగా.. లేదని న్యాయవాది బదులిచ్చారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని బెయిల్‌ పిటిషన్ను కొట్టేశారన్నారు.

వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) దుశ్యంత్‌రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ‘ఎస్సీ,ఎస్టీ చట్టం నిందితుల్లో ఇద్దరికి వర్తిస్తుందని అనుకున్నా అందర్ని రిమాండ్‌కు ఎందుకు పంపారు? బెయిలబుల్‌ నేరాల్లో పోలీసులు రిమాండ్‌కు పంపాల్సిన అవసరం ఏముంది?. సరైన కారణం లేకుండా పిటిషనర్లు గత 18 రోజులుగా కారాగారంలో మగ్గుతున్నారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది. ఎస్సీలని తెలిసికూడా ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేస్తారా?. ఫలానా కారణంతో వారిని రిమాండ్‌కు పంపాలని ఒక్క కారణమైనా రిపోర్ట్‌లో పేర్కొనలేదు? మంగళగిరి పోలీసులు గతంలో ఓ కేసులో ఇలానే వ్యవహరించారు. చట్ట నిబంధనలను పాటించకుండా నిందితుల్ని రిమాండ్‌కు ఎందుకు పంపుతున్నారో చెప్పండి. డీజీపీ పర్యవేక్షణలో రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? పోలీసుల ముందు తనెలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని ఫిర్యాదుదారు చెబుతున్నారు? దానికేం సమాధానం చెబుతారు? గరిష్ఠంగా ఏడేళ్ల శిక్షకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు అధికారి నోటీసులు ఇవ్వాల్సి ఉంది.. ఆ విధానాన్ని ఎందుకు పాటించలేదు? కులం పేరుతో దూషించలేదని ఫిర్యాదుదారు అఫిడవిట్‌ వేసినా గుంటూరు కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు’ అని ప్రశ్నించారు.

వాంగ్మూలం ఇచ్చారు: అదనపు పీపీ

అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసుల ముందు ఫిర్యాదుదారు సీఆర్‌పీసీ 161 ప్రకారం వాంగ్మూలం ఇచ్చారు. రెండు గ్రూపుల మధ్య వివాదం నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో పోలీసులు రిమాండు కోరారు’ అన్నారు. అదే విషయాన్ని రిమాండు రిపోర్టులో ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తి నిలదీశారు. ‘‘నిందితులు ఎవరితో గొడవ పడుతున్నారో వారి పేర్లు ఏవి? సక్రమంగా దర్యాప్తు చేయకుండా అరెస్టు చేస్తారా? వ్యక్తుల జీవితం, స్వేచ్ఛ విషయంలో వ్యవహరించేది ఇలాగేనా? పోలీసుల తీరు చాలా దురదృష్టకరం. పిటిషనర్లు తాము ఎస్సీలమని చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? రిమాండు రిపోర్టు చూస్తుంటే.. ఎస్సీలని తెలిశాకే వారిని రిమాండుకు పంపాలని కోరినట్లు స్పష్టమవుతోంది. దర్యాప్తు తీరు సరిగా లేదు. నిందితులను చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడం దయనీయం’’ అన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పిటిషనర్లకు బెయిలు మంజూరు చేశారు. నివేదికలు సమర్పించాలని ఆదేశించారు

ఇదీ చదవండి: నేడు మంత్రులతో సీఎం కేసీఆర్​ భేటీ.. జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.