ETV Bharat / state

ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు.. కట్టకపోతే మమ్మల్ని అడగొద్దు! - విద్యార్థుల ఫీజులపై ప్రైవేట్ కళాశాలలకు ఏపీ ప్రభుత్వ సూచనలు

ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు కళాశాలలు ఒత్తిడి చేయొద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కాగానే చెల్లిస్తారని తెలిపింది. ఆ డబ్బు దుర్వినియోగం చేస్తే తమకు సంబంధం లేదని ఉత్తుర్వుల్లో తేల్చి చెప్పింది.

ap-government-orders-private-colleges-not-to-force-parents-to-pay-fees
ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు.. కట్టకపోతే మమ్మల్ని అడగొద్దు!
author img

By

Published : Nov 6, 2020, 5:07 PM IST

జగనన్న విద్యా దీవెనకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల చెల్లింపు కోసం ఒత్తిడి తేవద్దంటూ.. ప్రైవేటు కళాశాలలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అడ్మిషన్ల సమయంలో ఫీజులు చెల్లించాలని వారిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది.

లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపింది. నిధులు విడుదల చేసిన వారంలోగా ఫీజును కళాశాలలకు చెల్లిస్తారని స్పష్టం చేసింది. సరైన కారణం లేకుండా చెల్లించకపోయినా.. పథకం ద్వారా పొందిన డబ్బును తల్లిదండ్రులు దుర్వినియోగం చేసినా తమ ప్రభుత్వానిది బాధ్యత కాదని ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.