ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,073 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 5,606 మంది మృతి చెందారు. 5,88,169 మంది కోలుకోగా.. వివిధ ఆస్పత్రుల్లో 67,683 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రాలో ఇప్పటివరకు 54,47,796 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,031 కరోనా కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 931, ప్రకాశం జిల్లాలో 806, చిత్తూరు జిల్లాలో 713, గుంటూరు జిల్లాలో 533 కరోనా కేసులు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో 459, అనంతపురం జిల్లాలో 456, శ్రీకాకుళం జిల్లాలో 430 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కృష్ణా జిల్లాలో 423, విజయనగరం జిల్లాలో 378, కడప జిల్లాలో 368, విశాఖ జిల్లాలో 340, కర్నూలు జిల్లాలో 205 మందికి వైరస్ సోకినట్లు నిర్థరణ అయింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురం జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఐదుగురు, కడప, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి: కరోనాతో.. సీజనల్ వ్యాధులకు హడలే..!