ETV Bharat / state

నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే.. పోలవరంలో నీళ్లు: జగన్​ - అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన

CM Jagan on Polavaram: నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్‌ లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. గోదావరి వరద ముంపు బాధితులతో అన్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పర్యటించిన జగన్‌... కుయుగూరులో వరద బాధితులను పరామర్శించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతామన్న సీఎం జగన్.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయబోమన్నారు.

Cm Jagan
నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే.. పోలవరంలో నీళ్లు: జగన్​
author img

By

Published : Jul 27, 2022, 3:26 PM IST

CM Jagan on Polavaram: పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీపడుతున్నామని ఏపీ సీఎం జగన్​ తెలిపారు. పోలవరంలో పూర్తిస్థాయి నీటిమట్టం వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కావాలంటే.. మరో రూ.20 వేలు కోట్లు కావాలని వెల్లడించారు. ఇప్పటికే కేంద్రానికి రూ.2,900 కోట్లు ఎదురిచ్చామని.. ఇచ్చింది రాబట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. డబ్బు రాబట్టేందుకు కేంద్రంతో యుద్ధాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నామని.. పోలవరం నిధుల కోసం తరచూ కేంద్రానికి లేఖలు రాస్తునే ఉన్నామని తెలిపారు. కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం... బతిమిలాడుతూనే ఉన్నామని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పర్యటించిన జగన్‌... కుయుగూరులో వరద బాధితులను పరామర్శించారు.

పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా నీరు నింపం అని.. మొదట 41.15 మీటర్ల మేరే నింపుతామని తెలిపారు. పూర్తిగా నీరు నింపే సమయం నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఒకేసారి నీరు నింపితే డ్యామ్‌ భద్రతకు ప్రమాదం ఉంటుందని.. డ్యామ్‌లో పూర్తిగా నింపడానికి కేంద్ర జలసంఘం ఒప్పుకోదని వెల్లడించారు. మొదట డ్యామ్‌లో సగం వరకు నీరు నింపుతామని.. ఆ తర్వాత మూడేళ్లలో పూర్తిగా నింపుతామని పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే సొంతంగా ఇచ్చైనా తోడుగా ఉంటానని నిర్వాసితులకు సీఎం హామీ ఇచ్చారు.

సెప్టెంబర్‌లోగా 41.15 మీటర్ల వరకు ఉన్న నిర్వాసితులకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. రూ. వెయ్యి, 2 వేల కోట్లు అయితే ఇంత ఆలోచించేవాణ్ని కాదని.. రూ.20 వేల కోట్లు అయినందున కేంద్రం సాయం కావాల్సిందేనని స్పష్టం చేశారు.

నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే.. పోలవరంలో నీళ్లు: జగన్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.