ETV Bharat / state

Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: ఏపీ సీఎం జగన్ - ap news

కొవిడ్ థర్డ్​వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం ఏపీలో 3 కేర్‌ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్​పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు(pediatric wards) ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం ఆదేశించారు.

ap cm jagan review
ap cm jagan review
author img

By

Published : Jun 7, 2021, 7:30 PM IST

కొవిడ్‌ మూడో వేవ్‌ (Covid Third Wave)పై ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan) అధికారులతో సమీక్షించారు. థర్డ్‌వేవ్‌ వస్తే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మూడో వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు సీఎంకు వివరించారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధరణ లేదని వెల్లడించారు. అయినా ఒకవేళ వస్తే కనుక తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను సీఎంకు సమర్పించారు.

కేర్ సెంటర్లు ఏర్పాటు చేయండి..

థర్డ్​వేవ్ దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు ((care centers)) ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ-గుంటూరులో ఒకచోట కేర్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. థర్డ్ వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమం కొనసాగించాలన్నారు. పిల్లల్లో లక్షణాలు గుర్తించేందుకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని బోధనా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.

'ఒకవేళ థర్డ్‌వేవ్‌ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పీడియాట్రిక్‌ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. జాతీయ ప్రమాణాలను అనుసరించాలి. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలి. థర్డ్‌వేవ్‌ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలి '- ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ప్రస్తుతం సంపూర్ణ పోషణ్‌ కింద డ్రైరేషన్‌ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అలాగే గోరుముద్ద (jagananna gorumudda) పథకాన్ని పర్యవేక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇవన్నీ సక్రమంగా చేసుకుని ముందుకు వెళ్తే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటామని అన్నారు. పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎంపానెల్‌ కోసం గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు టీచింగ్‌ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. ఆస్పత్రుల వారీగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టాలన్నారు. వీటికి సంబంధించి జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి: KTR : 'రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.