ETV Bharat / state

'లిక్కర్ స్కామ్‌లో విజయసాయి రెడ్డి రంగు బయటపడింది' - పంచుమర్తి అనురాధ

Delhi Liquor Scam Arrests: దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో విజయసాయిరెడ్డి పాత్ర బయటపడిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. అరబిందో ఫార్మాలో కీలక డైరెక్టర్​ శరత్ చంద్రారెడ్డి అరెస్టు పట్ల వైకాపా నేతలు ఇప్పుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో తయారయ్యే కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

Delhi Liquor Scam Arrests
Delhi Liquor Scam Arrests
author img

By

Published : Nov 10, 2022, 1:14 PM IST

లిక్కర్ స్కామ్‌లో విజయసాయి రెడ్డి రంగు బయటపడింది

Delhi Liquor Scam Arrests: దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో విజయసాయిరెడ్డి పాత్ర బయటపడిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. అరెస్టయిన పెన్నక శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయంగా అన్నే అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు చూస్తున్న విజయసాయి రేపు మోదీకి శరత్ చంద్రారెడ్డి అరెస్టుపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ప్రధాని మోదీని రాష్ట్రానికి తీసుకొచ్చేది విజయసాయిరెడ్డా లేక మరెవరా అనేది భాజపా నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అరబిందో ఫార్మా కీలక డైరెక్టర్​ శరత్ చంద్రారెడ్డి అరెస్టు పట్ల వైకాపా నేతలు ఇప్పుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంచలంచెలుగా మద్యం మాఫియా పెంచారనటానికి సాక్ష్యమే శరత్ చంద్రారెడ్డి అరెస్టని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో తయారయ్యే కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణంతో పాటు అంబులెన్స్​ల కుంభకోణంలోనూ విజయసాయిరెడ్డే ఉన్నాడని దుయ్యబట్టారు. ప్రజల్ని నాసిరకం మత్తులో ముంచుతూ ప్రజారోగ్యాన్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.