ETV Bharat / state

లాలాపేట్​లో యాంటీజెన్​ టెస్టులు ప్రారంభం

author img

By

Published : Jul 12, 2020, 7:20 AM IST

లాలాపేట్​లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్​ టెస్టులు ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Antigen tests begin in Lalapet hyderabad
లాలాపేట్​లో యాంటీజెన్​ టెస్టులు ప్రారంభం

హైదరాబాద్ తార్నాక డివిజన్ లాలాపేట్​లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం నుంచి ఉచితంగా కరోనా (యాంటీజెన్ టెస్టులు) పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 24 మందికి పరీక్షలు చేయగా.. అందులో ఇద్దరికి కొవిడ్​ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇద్దరినీ హోం ఐసోలేషన్​లో ఉండాలని సూచించామన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి వారిని ఎక్కడ ఉంచాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఆక్సిజన్ అవసరమైన వారైతే గాంధీ ఆసుపత్రికి పంపిస్తామని, ఇంట్లో స్థలం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలిస్తామని అన్నారు.

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని రాజశ్రీ తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సెకండరీ కాంటాక్ట్స్​ ఉన్న వ్యక్తులకు ముందుగా ప్రాధాన్యం ఇస్తామని, పరీక్షలు నిర్వహించిన అరగంటలోనే రిపోర్టులు అందజేస్తున్నామని వివరించారు. కేవలం లక్షణాలు ఉన్నవారు మాత్రమే కేంద్రానికి రావాలని సూచించారు.

ఇదీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.