హైదరాబాద్ ఓయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైడ్రో-2019 పేరుతో భాగ్యనగరంలో మూడు రోజులపాటు సదస్సు జరుగనుంది. ఈ మేరకు ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో సదస్సుకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు.
ఈ నెల 18 నుంచి 20 వరకు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొ. గోపాల్ నాయక్ తెలిపారు. హోటల్ మారియట్లో 24వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హైడ్రాలిక్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ కోస్టల్ ఇంజనీరింగ్ (హైడ్రో 2019) అంశంపై ఈ సదస్సు జరుగనుందని అన్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి : సీఏబీకి వ్యతిరేకంగా ఉర్దూ యూనివర్సిటీలో ఆందోళనలు