TSPSC Paper Leak Case Updates : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసును సిట్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో... మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Sit on TSPSC Paper Leak Case : అతనిని సిట్ విచారిస్తోంది.పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు అధికారులు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
Minister Sabhita indrareddy on TSPSC Paper Leak Case : మరోవైపు ఈ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని వెల్లడించారు. పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇక ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దూమరం రేపుతోంది. ప్రతి పక్షాలు అన్ని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు కారణం మంత్రి కేటీఆర్ అని ఆరోపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ సహా చిన్న పార్టీలు అన్ని ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈరోజు బీజేపీ.. ధర్నా చౌక్‌లో మా నౌకరీలు మాగ్గావాలె అనే నినాదంతో మహా ధర్నా చేపట్టారు. ఈ మహా ధర్నాలో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, విజయ శాంతి, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు.
టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రే బర్తరఫ్ చేయాలని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయం ఉందని కేటీఆర్ చెప్పారని... ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్ట్ చేశారో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని వెల్లడించారు.
ఇవీ చదవండి:
హామీల అమలు పర్యవేక్షణ విధానమేంటో చెప్పాలి: హైకోర్టు
TSPSC లీకేజీ వ్యవహారం.. ప్రశ్నాపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో 19 మందిని సాక్ష్యులుగా నమోదు చేసిన సిట్