కరోనా వల్ల ఎంసెట్ రాయలేక పోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులు ఈనెల 5 వరకు వివరాలు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
ఆగష్టు 17 నుంచి సెప్టెంబరు 14 మధ్య కరోనా సోకి.. ఆ కారణంగా ఎంసెట్ రాయలేక పోయిన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కరోనా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు, హాల్‌టికెట్‌తో పాటు.. వెబ్‌సైట్‌లోని అండర్ టేకింగ్‌ను సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు convenertseamcet2020@jntuh.ac.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపించాలని కన్వీనర్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ