రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,305 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి మరో 29 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,896కు చేరింది. మరో 6,361 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 54,832 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 607, ఆదిలాబాద్ 34, కొత్తగూడెం 130, జగిత్యాల 125, జనగామ 63, భూపాలపల్లి 76, జోగులాంబ గద్వాల 71, కామారెడ్డి 36, కరీంనగర్ 229, ఖమ్మం 222, ఆసిఫాబాద్ 29, మహబూబ్‌నగర్ 137, మహబూబాబాద్ 94, మంచిర్యాల 139, మెదక్ 47, మల్కాజిగిరి 291, ములుగు 51, నాగర్‌కర్నూల్ 143, నల్గొండ 246, నారాయణపేట 26, నిర్మల్ 25, నిజామాబాద్ 82, పెద్దపల్లి 134, సిరిసిల్ల 71, రంగారెడ్డి 293, సంగారెడ్డి 111, సిద్దిపేట 169, సూర్యాపేట 31, వికారాబాద్ 158, వనపర్తి 110, వరంగల్ రూరల్ 122, వరంగల్ అర్బన్ 128, భువనగిరి 75 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'త్వరగా రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు సర్కారు కృషి'