ETV Bharat / state

"నేటి తరానికి రైతు పంటలు పండిస్తాడనే తెలియదు"

దేశానికి వెన్నెముకగా నిలిచే రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ప్రపంచానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనిపై సాహిత్య అకాడమి ఛైర్మన్ నందిని సిదారెడ్డి రూపొందించిన నృత్యరూపకం పలువురిని ఆలోచింపజేసింది.

"నేటి తరానికి రైతు పంటలు పండిస్తాడనే తెలియదు"
author img

By

Published : May 16, 2019, 1:34 PM IST

"నేటి తరానికి రైతు పంటలు పండిస్తాడనే తెలియదు"

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ ఇండియా సౌజన్యంతో, ఇందిర పరశురాం బృందం సమర్పణలో ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి రాసిన 'అన్నదాత సామాజిక నృత్యరూపకం' తొలి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ నృత్యకళాకారిణి పద్మజారెడ్డి పాల్గొన్నారు.

రైతు వేదన

ఈ కార్యక్రమంలో పంట వేసిన నాటి నుంచి అది ఇంటికి చేరే వరకు రైతు పడే ఆవేదన, బాధలు, కష్టాలను కన్నీటికి కట్టినట్లు చక్కటి అభినయంతో ప్రదర్శించి మెప్పించారు పలువురు కళాకారులు. భూమి అనేది పాలన, అధికారానికి కేంద్ర బిందువుగా మారిందని... ఆనాటి నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు అదే జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నదాత ఎవరు?

నేటితరం యువతకు అన్నదాత అనే పదమే పరిచయం లేదని...రైతు అనేవాడు పంటలు పండిస్తాడనే విషయమే తెలియడం లేదని సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిదారెడ్డి అవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : మల్లన్న సాగర్​ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.