రాష్ట్రంలో చేపల అమ్మకాలకు 150 సంచార వాహనాలను రేపు ప్రారంభిస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటించారు. సభ్యులు ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో 59 వేల 982 చిన్న, పెద్ద తరహా నీటి వనరుల్లో 2వేల8 కోట్ల 65 లక్షల వ్యయంతో 260.68 కోట్ల చేప పిల్లలు విడుదల చేశామని తెలిపారు.
జలాశయాల్లో నీటి లభ్యత ఆధారంగా చేపలు, రొయ్యల పెంపకం చేపడుతున్నామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్య్సకారులకు సొసైటీల ఏర్పాటుతో పాటు వాహనాలు సమకూర్చామన్నారు. శంషాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై చేపల మార్కెట్ ఏర్పాటుచేసే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి'