హైదరాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్లోని నాలాపై వంతెన విస్తరణ పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2.35 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాలోకి ఎగువ నుంచి వచ్చే నీరు సక్రమంగా వెళ్లకపోవడం వల్ల నీరు రోడ్డుపై నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీనికి పరిష్కారం వంతెన విస్తరణేనని భావించి నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
మంత్రి వెంట కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొనటం దీపిక, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ శివానంద్ రెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం