గున్న ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహంతో వ్యక్తిని తొక్కేసిన గజరాజు! - ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం సుర్లలో గున్న ఏనుగుతో స్థానికుల సెల్ఫీలు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని సుర్ల సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తోంది. స్థానికులు గజరాజు పిల్లను పట్టుకుని సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో ఏనుగు ఓ వ్యక్తిపై దాడి చేసింది. తీవ్రగాయాలు పాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా నుంచి ఆంధ్రకు వచ్చిన గజరాజులు.. రెండు రోజులుగా పంటలపై దాడి చేసి స్థానిక రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు.. కొన్ని ఆంధ్రలో తిష్ట వేశాయి. మరో గుంపు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని సన్నాపురంలో రొయ్యల చెరువును ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే ఓ గున్న ఏనుగు స్థానికులకు చిక్కడం.. గజరాజు ఒకరిపై దాడి చేయడం జరిగింది.
గున్న ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహంతో వ్యక్తిని తొక్కేసిన గజరాజు!
By
Published : Dec 29, 2020, 10:41 PM IST
-
గున్న ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహంతో వ్యక్తిని తొక్కేసిన గజరాజు!
-
గున్న ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహంతో వ్యక్తిని తొక్కేసిన గజరాజు!