యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రాబ్యాంకు బోర్డు సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. విలీనం పేరుతో బ్యాంకులను మూసేయటమేంటని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర ప్రకటించిన విలీనాలకు ఎలాంటి శాస్త్రీయత లేదని వారు అభిప్రాయ పడ్డారు. ఆంధ్రాబ్యాంకుతో తెలుగు ప్రజలకు భావోద్వేగ సంబంధమున్నదని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. గత త్రైమాసికంలో లాభాలొచ్చినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ రెండో వారం నుంచి సమ్మెకు నోటిసులిచ్చామని, ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :సినీతారల నోట 'సేవ్నల్లమల' మాట