ఔషధం పంపిణీకి ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో.. రహస్య ప్రాంతంలో ఉన్న ఆనందయ్య(anandaiah) పోలీసు భద్రత నడుమ తిరిగి కృష్ణపట్నానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన తన నివాసానికి వచ్చారు.
ఔషధం తయారీకి మూడు రోజులు సమయం పడుతుందని, ఔషధానికి కావాల్సిన వనమూలికలు సమకూర్చుకోవాల్సి ఉందని ఆనందయ్య చెప్పారు. అధికారులతో మాట్లాడి ఔషధ పంపిణీ తేదీని ప్రకటిస్తానని అన్నారు. ఔషధం కోసం ఇతర ప్రాంత వాసులు కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.