ETV Bharat / state

అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు - an old man stuck in heavy rain flood in hyderabad

హైదరాబాద్​లో ఓ వ్యక్తి వరదనీటిలో కొట్టుకెళ్లిన వీడియో ఆ మధ్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అసలు ఆ వ్యక్తి కొట్టుకుపోయాక... మళ్లీ ఎప్పుడు బయటకొచ్చాడు... అసలు సురక్షితంగా బయట పడ్డారా... తెలుసుకోవాలనుకుంటున్నారా...!

అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు
author img

By

Published : Oct 1, 2019, 12:27 PM IST

అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు

హైదరాబాద్‌ భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవల యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌ వద్ద ఓ వృద్ధుడు వరదనీటిలో కొట్టుకెళ్లిన వీడియో బయటకొచ్చింది. సదరు వ్యక్తి.. కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. అప్పటికే వరదనీరు భారీగా వస్తుండటం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకెళ్లాడు.

ఆ తర్వాత ఏం జరిగిందంటే...

వృద్ధుని ఆర్తనాదాలు విన్న స్థానికులు అతికష్టం మీద కాపాడారు. అప్పటికే 100 ఫీట్ల వరకు ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. ఎలా అయితేనేం.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.

ఇవీ చూడండి: రాళ్లల్లోంచి ఉబికి వస్తున్న గంగమ్మ... దేవుడి మహిమేనా..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.