నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా అందరికీ సుపరిచితులైన అంశాల స్వామి.. మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. అతని జీవనాధారం కోసం గతంలో ఒక హెయిర్ కటింగ్ సెలూన్‌ను ఏర్పాటు చేయించిన కేటీఆర్... ఒక పక్కా ఇల్లుని అందించనున్నట్లు ప్రకటించారు. అనంతరం అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అతనికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తెరాస సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ తీసుకోవాలని సూచించారు.
'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఈ మేరకు మంత్రికి అంశాల స్వామి ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథ వల్ల ఫ్లోరైడ్ సమస్యకు విరుగుడు దొరుకుతుందని... ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతానని వెల్లడించారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల