ETV Bharat / state

Amit Shah Telangana Tour Schedule : అమిత్​షా తెలంగాణ టూర్.. షెడ్యూల్ ఇదే

Schedule of Amit Shah Telangana Tour : రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. కేసీఆర్​ను ఎలాగైనా ఈసారి గద్దె దించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫోకస్ అంతా తెలంగాణ వైపే ఉంది. తెలంగాణే లక్ష్యంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ ​షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. అమిత్​షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్ తాజాగా ఖరారైంది.

Amit Shah Telangana Tour Schedule
Amit Shah Telangana Tour Schedule
author img

By

Published : Jun 12, 2023, 1:27 PM IST

Amit Shah Visits Telangana On June 15th : రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలైన.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాన్ని రెడీ చేసుకుంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతునట్లు తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పావులు కదుపుతోంది. ఇక ఈ రెండు పార్టీలు గల్లీలో దుష్మన్.. దిల్లీలో దోస్తుల్లాగా ఉంటున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గద్దెపై తమ జెండాని ఎగురవేయాలని చూస్తోంది.

Amit Shah Attends BJP Public Meeting in Khammam : ముఖ్యంగా బీజేపీ.. సీఎం కేసీఆర్​ను ఎలాగైనా ఈ సారి గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే తన వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా మహా జన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Amit Shah Telangana Tour Schedule : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మహా జన సంపర్క్ అభియాన్​లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు అమిత్​షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జేడి కన్వెన్షన్​కు చేరుకుని 11:15 నుంచి 12:45 వరకు అల్పాహార సమావేశం అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో భద్రాచలంకు పయనం అవుతారు.

Amit Shah Telangana Tour Update : భద్రాచలం చేరుకుని 2:20 నుంచి 3:20 వరకు రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4:50 నుంచి 5:50 వరకు ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభ ముగించుకుని సాయంత్రం 6 గంటలకు శంషాబాద్​కు బయల్దేరుతారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్​కు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్​లో పలువురు నేతలు, మేధావులతో వేర్వేరుగా సమావేశం అవుతారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని రాత్రి 9:30కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అమిత్​షా హాజరయ్యే ఖమ్మం సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేసింది. ఈ సభను విజయవంతం చేసి ఖమ్మంలో బీజేపీ బలంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.