ప్రజారోగ్యం, సంక్షేమమే తమ లక్ష్యమని, పేదల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తానని అమీర్పేట డివిజన్ భాజపా అభ్యర్థి కేతినేని సరళ అన్నారు. డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను అధిష్టానం గుర్తించి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పాలకుల నిరాదరణకు గురై డివిజన్ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పక విజయం సాధిస్తానని, అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.