హైదరాబాద్ సోమాజిగూడలో మాక్సివిజన్ కంటి ఆసుపత్రిని.. ఎస్టోనియా రిపబ్లిక్ రాయబారి కాట్రిన్ కివి సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంటి వైద్యం అందిస్తున్నట్లు మాక్సివిజన్ ఆసుపత్రి సిబ్బంది ఎస్టోనియా రిపబ్లిక్ రాయబారి కాట్రిన్ కివికి వివరించారు.
విజన్ కేర్ టెక్నాలజీ విప్లవంలో మాక్సివిజన్ ముందంజలో ఉందని... డయాగ్నస్టిక్స్ చికిత్స, శస్త్రచికిత్స, నేత్ర సంరక్షణలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆప్టికల్, కాంటాక్ట్ లెన్స్ కోసం వన్-స్టాప్ షాపుగా తమ సేవలను అందిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రేప్ కల్చర్‌ను అంతమొందించండిలా..