ETV Bharat / state

సామాన్య మహిళల అసామాన్య పోరాటం

author img

By

Published : Oct 5, 2020, 2:50 PM IST

వారంతా ఇల్లు, వృత్తి తప్ప మరో ప్రపంచమే తెలియని సామాన్య మహిళలు. మూడు రాజధానుల నిర్ణయంతో... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, అమరావతి కోసం తమలాగే భూములిచ్చిన వేలాది మంది రైతులు పడుతున్న వేదన, ప్రభుత్వ అణచివేత చర్యలు చూసి చలించిపోయారు. తొలి రోజు నుంచే పోరుబాట పట్టిన వీరంతా పోలీసు ఆంక్షలకు, లాఠీ దెబ్బలకు ఎదురొడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వెరవక విభిన్న రూపాల్లో నిరసన కొనసాగించారు. అమరావతి పరిరక్షణకు అహరహం శ్రమిస్తున్న వీరంతా తమ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు రైతుల తరఫున ప్రతినిధి బృందంగా ఇటీవల దిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్‌దాస్‌ అథవాలే, మురళీధరన్‌, కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేష్‌, సీపీఐ జాతీయ నాయకుడు డి.రాజా, సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులను కలిసి అమరావతికి వారి అండదండలు కోరారు. ఈ ప్రతినిధి బృందంలోని నారీమణులు, వారి ఉద్యమ అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.

amaravathi protest women leaders in guntur district
సామాన్య మహిళల అసామాన్య పోరాటం

ఆంధ్రప్రదేశ్​ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజధానికి మా భూములిచ్చాం. మేం సాగు చేసుకునేటప్పుడు ఎకరానికి ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చేది. జీవనాధారాన్ని కోల్పుతున్నా... నాలుగు రోజులు ఓపికపడితే, గొప్ప నగర నిర్మాణం జరుగుతుందని, రాష్ట్రం బాగుపడుతుందని నమ్మాం. కానీ... ప్రభుత్వమే మమ్మల్ని మోసగిస్తే ఉద్యమించకుండా ఎలా ఉంటాం? అమరావతి ఉద్యమాన్ని ఒక సామాజిక వర్గానికే ఆపాదిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఊరిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అంతా ఒకే కులం వారుంటారా? రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 50 శాతానికి మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల రైతులున్నారు. నాలాగే కడుపు మండి రగిలిపోతున్న వేల మంది అమరావతి కోసం ఉద్యమిస్తుంటే మమ్మల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంటూ మానసికంగా చంపేస్తున్నారు. నిజంగా మేం వ్యాపారులమైతే ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుని, ఆ డబ్బుతో విశాఖపట్నంలోనే భూములు కొనుక్కొనేవాళ్లం కదా.. దిల్లీలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని తెలిసినా వెరవకుండా అమరావతిని కాపాడుకునేందుకు వెళ్లాం. మాకు జరిగిన అన్యాయం, ప్రభుత్వ అణచివేత ధోరణి దిల్లీలోని వివిధ పార్టీల పెద్దలకు అర్ధమైంది. మా ఆవేదన చూసి... ‘అసలు మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా? ఇంత పోరాటం చేస్తుంటే పట్టించుకోరా?’ అని వారు అడిగారు.

కంభంపాటి శిరీష: రాయపూడికి చెందిన సాధారణ గృహిణి. ఎస్సీ వర్గానికి చెందిన ఆమె కుటుంబం రాజధాని నిర్మాణానికి 2.30 ఎకరాల భూమి ఇచ్చింది. రాజధాని ఉద్యమం మొదలయ్యేవరకు ఆమెకు కుటుంబ బాధ్యతలు తప్ప మరో ప్రపంచమే తెలియదు.

రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుంటే ఎవరికీ పట్టదేంటి?

రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనమవుతుంటే ఎవరికీ పట్టదేంటి? అన్న ఆవేదనతో పోరాటంలోకి వచ్చా. నాలాంటి వేల మంది రైతుల కన్నీటి గాథల్ని జాతీయస్థాయిలో వివరించేందుకే దిల్లీ వెళ్లా. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ అమరావతికి మద్దతు తెలిపిన తర్వాతే మేం భూములిచ్చాం. ఇప్పుడు మమ్మల్ని నిలువునా ముంచేశారు. దిల్లీలో నాయకుల్ని కలిసిన తర్వాత మాకు కొంత మనోధైర్యం లభించింది.

మువ్వా సుజాత: అనంతవరంలోని బీసీ వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఆమె కుటుంబం రాజధానికి నాలుగెకరాలు ఇచ్చింది. ఎన్నడూ గడప దాటి ఎరుగని ఆమె... దిల్లీ వెళ్లి రైతుల గళాన్ని జాతీయ నాయకులకు వినిపించారు.

భావితరాల ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతాం?

శాంతియుతంగా పోరాడుతున్న అమరావతి మహిళల్ని వేధించిన తీరు నన్ను కలచివేసింది. మహిళలు అంతలా ఉద్యమిస్తుంటే నేను ఊరికే ఉండలేకపోయా. నాలాంటి వారు ఇప్పుడు ముందుకు రాకుంటే రాష్ట్రానికి జరిగే నష్టంపై భావితరాలు అడిగే ప్రశ్నలకు మన వద్ద సమాధానాలుండవు. అమరావతితో నాకు భావోద్వేగ అనుబంధముంది. దిల్లీలో మేం కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల ఎంపీలను కలిసినప్పుడు.... ఏపీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళుతోందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేశారు.

రాయపాటి శైలజ: గుంటూరుకి చెందినవారు. వృత్తి రీత్యా వైద్యురాలు. రాజధాని అమరావతి మహిళల పోరాటాన్ని చూసి చలించారు. ఉద్యమంలో తొలి నుంచీ భాగస్వామ్యమయ్యారు.

అనుభవం లేని వ్యక్తిని ఎన్నుకున్న ఫలితమే ఇది..

నేను అమరావతి గ్రామాలకు చెందిన వ్యక్తిని కాకపోయినా ఉద్యమంలో పాల్గొంటున్నా. ఎందుకంటే ఇదేదో 29 గ్రామాల రైతుల ఆక్రోషం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలందరి సమస్య. అనుభవం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఫలితమే ఇదంతా. మూడు పంటలు పండే భూముల్ని రైతులు తృణప్రాయంగా త్యాగం చేశారు. తరతరాలుగా వస్తున్న జీవనాధారాన్ని కోల్పోయిన వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న గ్రామాల్లో పోలీసుల్ని మోహరించి వేధిస్తుంటే మౌనంగా ఉండాలా? దిల్లీలో వివిధ పార్టీల నాయకుల్ని కలసి... ఇక్కడ జరుగుతున్నదంతా వివరించాం. వారు మాకు మద్దతు పలికారు.

సుంకర పద్మశ్రీ: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు. గన్నవరం సమీపంలోని ఆత్కూరు స్వగ్రామం. మూడు రాజధానులతో రాష్ట్ర భవిష్యత్తుకి జరిగే నష్టాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఉద్యమంలోకి వచ్చారు.

రాజకీయంగా, ఆర్థికంగా నష్టం

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? పరిపాలన రాజధానిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తే రాయలసీమ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ లేవనెత్తరా? రాష్ట్రానికి రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. రాజధాని నిర్మాణానికి రూ.వేల కోట్లు నిధులిచ్చిన కేంద్ర ప్రభుత్వం... రాజధాని మార్పు విషయంలో వారికేమి సంబంధం లేదనడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దిల్లీలో మేం కలిసిన కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నాయకులంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు.

అక్కినేని వనజ: సీపీఐ నాయకురాలు. పలు రాజకీయ, ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టుగా భావించి అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు.

దేశ విచ్ఛిన్నానికి బాటలు వేస్తుంది

మూడు రాజధానుల నిర్ణయం దేశ విచ్ఛిన్నానికి బాటలు వేస్తుంది. దిల్లీలో వివిధ పార్టీల ప్రతినిధుల్ని మేము కలిసినప్పుడు వారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిలో నాకు భూములేమి లేవు. రాజధాని ప్రాంత రైతుల ఆవేదన నన్ను కదలించింది. నందిగామ కేంద్రంగా 60 రోజులపాటు దీక్షలు చేశాం. జగన్‌ నిర్ణయం చారిత్రక తప్పిదమవుతుంది.

తంగిరాల సౌమ్య: కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. తెదేపా నాయకురాలు. రాజధాని ప్రాంత రైతులు పడుతున్న ఆవేదన చూసి చలించి ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.