ETV Bharat / state

అధికారిక ప్రకటన తర్వాతే కార్యాచరణ: పవన్​కల్యాణ్ - పవన్ కల్యాణ్ ను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి

ఏపీలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో రెండో రోజు పార్టీ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు.. పవన్​ను కలిశారు. అమరావతి ఉద్యమం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమకారులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికావని పవన్ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని భాజపా తనకు స్పష్టం చేసిందన్న పవన్.. రైతులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

pawan on amaravathi
'రాజధానిపై అధికారిక ప్రకటన వచ్చాక కార్యాచరణ ప్రకటిస్తాం'
author img

By

Published : Nov 18, 2020, 7:13 PM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సమావేశమైయ్యారు. అమరావతి ఉద్యమకారులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికాదని పవన్‌ అన్నారు. బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా? అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే ఉండాలా? అంటూ మండిపడ్డారు. ఉద్యమానికి సామాజిక వర్గానికి ముడిపెట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

రాజధానిని 3 ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు పవన్‌కల్యాణ్‌. రైతులకు న్యాయం చేసే విషయంలో వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని భాజపా తనకు స్పష్టం చేసిందని తెలిపారు. రాజధాని తరలిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదన్నారు. అధికారికంగా ప్రకటించాక తమ పార్టీ కార్యాచరణ చెబుతామని పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.

ఇవీచూడండి: స్వచ్ఛ భారత్​లో మరోసారి తెలంగాణ హవా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.