ETV Bharat / state

1.12 లక్షల మందికి డిగ్రీ సీట్లు.. 1.11 లక్షల బీటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి - Dost first phase seats allotment

రాష్ట్రంలో 'దోస్త్​' తొలి విడతలో 1,12,683 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. వారిలో 1,12,683 మందికి సీట్లు దక్కాయని, చాలా తక్కువ ఆప్షన్లు నమోదు చేసినందున 6,215 మంది సీట్లు పొందలేకపోయారని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో 1,11,147 బీటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. మొత్తం సీట్లలో 35 వేలు తప్ప మిగిలినవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లే కావడం గమనార్హం.

1.12 లక్షల మందికి డిగ్రీ సీట్లు.. 1.11 లక్షల బీటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి

author img

By

Published : Aug 7, 2022, 7:40 AM IST

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ - తెలంగాణ(దోస్త్‌) తొలి విడతలో 1,12,683 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో 91 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చేరనున్నారు. ఐచ్ఛికాలు ఇచ్చుకున్న వారికి శనివారం సీట్లు కేటాయించారు. దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. వారిలో 1,18,898 మందే ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారని తెలిపారు. వారిలో 1,12,683 మందికి సీట్లు దక్కాయని, చాలా తక్కువ ఆప్షన్లు నమోదు చేసినందున 6,215 మంది సీట్లు పొందలేకపోయారని చెప్పారు.

....

మొత్తం విద్యార్థుల్లో 77 శాతం మందికి మొదటి ఛాయిస్‌లో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు దోస్త్‌ అభ్యర్థి లాగిన్‌లో తగిన ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా వాటిని రిజర్వు చేసుకోవాలి. ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు కొనసాగుతాయని వారు తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, దోస్త్‌ హెల్ప్‌ డెస్క్‌ కోఆర్డినేటర్‌ గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు...

* సీట్లు పొందినవారిలో 45,743 మంది అబ్బాయిలు(40.59 శాతం) ఉండగా.. 66,940 మంది(59.41 శాతం) అమ్మాయిలున్నారు.

* తొలిసారి ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రవేశపెట్టగా 568 మంది దరఖాస్తు చేశారు. 338 మందికి సీట్లు దక్కాయి.

* ఈ ఏడాది 978 కళాశాలల్లో మొత్తం సీట్లు 4,20,318. గత ఏడాది కంటే 12వేల సీట్లు అధికం. 53 రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల సీట్లు కలవడంతో అవి పెరిగాయి.

* 51 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు. వాటిల్లో అధిక శాతం గత ఏడాదీ అదే పరిస్థితి.

....

బీటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి..: ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2022-23)లో 1,11,147 బీటెక్‌ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. మొత్తం సీట్లలో 35 వేలు తప్ప మిగిలినవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లే కావడం గమనార్హం. గత ఏడాది 192 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 1,11,728 సీట్లు, 2020-21లో 201 కళాశాలల్లో 1,11,143 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. కళాశాలల సంఖ్యలో ఈసారి మార్పులేదని సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. ఈసారి డిమాండ్‌ లేని 7,380 సీట్లను రద్దు చేసుకున్న కళాశాలలు.. వాటి స్థానంలో 7,815 కొత్త సీట్లకు అనుమతి పొందాయి. ఏఐసీటీఈ మంజూరు చేసినా ఆయా కళాశాలలను తనిఖీ చేసి అనుమతి ఇచ్చే తుది నిర్ణయం విశ్వవిద్యాలయాలదే. దాంతో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన సీట్ల కంటే కొన్ని వేల సీట్లు తగ్గే అవకాశం ఉంది.

.....

ఇవీ చూడండి..

తెలంగాణకు 1.11 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు.. మూడొంతులు ఆ కోర్సులవే

పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.