హైదరాబాద్ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఈ నెల 27 నుంచి లాటరీ ద్వారా కేటాయింపులు చేయనున్నారు. ఫ్లాట్ల కొనుగోలు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారం ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 3 బీహెచ్కే డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తి పారదర్శకంగా దరఖాస్తుదారుల సమక్షంలోనే లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. మొదట బండ్లగూడ, ఆ తర్వాత పోచారం ఫ్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారులకు టోకెన్ నంబర్లు ఇచ్చి లాటరీ తీస్తారు. మొత్తం లాటరీ ప్రక్రియను చిత్రీకరించి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎమ్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాటును మాత్రమే కేటాయిస్తారు. ఆధార్ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఇవీ చూడండి..
Weather in TS: బయటకు వెళ్తున్నారా.. గొడుగు మరవొద్దు!!
సూదిని మింగిన పిల్లి.. గొంతులో అడ్డుపడి నరకం.. సర్జరీ తర్వాత...