ETV Bharat / state

అదనపు నిధులు కేటాయించండి: మంత్రి ఎర్రబెల్లి - హరితహారం, మిషన్ భగీరథ

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్‌కు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిధుల కేటాయింపు ప్రాధాన్యాంశాలపై లేఖ ఇచ్చారు. గ్రామాలను బలోపేతం చేయడానికి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.

అదనపు నిధులు కేటాయించండి: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Aug 5, 2019, 11:37 PM IST

గ్రామాల సమగ్రాభివృధి కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్​కు మంత్రి లేఖ అందించారు. రాష్ట్రంలో అమలు చేస్తోన్న కార్యక్రమాలను వివరిస్తూ, పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా కృషి చేస్తున్నమన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నాలుగు వేలకు పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న హరితహారం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. 14 వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 254కోట్ల రూపాయలను త్వరగా విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మొదటి విడత నిధుల కింద 52 కోట్లు ఇవ్వాలన్నారు. 200 కొత్త పంచాయతీ భవనాలతో పాటు మరో 200 గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎర్రబెల్లి అన్నారు.

అదనపు నిధులు కేటాయించండి: మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నరగంలో చేనేత వస్త్రాల ప్రదర్శన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.