సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ట్రెసా రెవెన్యూ ఐకాస చైర్మన్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం కలిగిందని చెప్పారు. ఆందోళనలు, నిరసనలు విరమించుకుంటున్నామని ప్రకటించారు. రేపటి నుంచి రెవెన్యూ ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండిః భక్తిపారవశ్యం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు