ETV Bharat / state

'అదే జరిగితే... దక్షిణ తెలంగాణ ఎడారైపోతుంది' - ఉత్తమ్​ కుమార్ రెడ్డి నిరసన

పోతిరెడ్డిపాడు సామర్థాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని అఖిల పక్ష నేతలు వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. ఏపీ సర్కార్ దీనిని వెంటనే ఉపసంహరించుకోకపోతే రాజకీయ, న్యాయపోరాటాలు తప్పవని హెచ్చరించారు.

all-party-protesting-on-pothireddy-project
'అదే జరిగితే... దక్షిణ తెలంగాణ ఎడారైపోతుంది'
author img

By

Published : May 13, 2020, 3:31 PM IST

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై అఖిల పక్షం నేతలు నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసన చేస్తూ... వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేళారు. నల్ల రిబ్బన్లతో దీక్షలు చేపట్టారు. ఉపసంహరించుకోకుంటే రాజకీయ, న్యాయపోరాటాలు తప్పవని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం జీవో అమలైతే శ్రీశైలం మొత్తం ఎండిపోతుంది. కృష్ణా నదిపై ఆధారపడ్డ జిల్లాలు ఎడారిగా మారిపోతాయి. తాగు, సాగు నీటికి ఎద్దడి ఏర్పడుతోంది.

- కోదండరామ్​

తక్షణమే ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడుపై స్పందించాలి. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. దీనిపై ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలి.

-చాడ వెంకట రెడ్డి

పోతిరెడ్డిపాడు లిఫ్ట్​కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇది తెలిసే పట్టించుకోలేదు. ఏపీ సీఎంతో తెలంcగాణ సీఎం కుమ్మక్కయ్యారు.

-భట్టి విక్రమార్క

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం.

-రేవంత్ రెడ్డి

పోతిరెడ్డిపాడు చేపడితే కృష్ణానదిపై ఆధారపడిన రైతుల పరిస్థితి ఏంటి? ఏపీ వాటా జలాలే తీసుకెళ్తున్నట్లు జగన్ చెప్పారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీళ్లు తీసుకెళ్తుంది. సామర్థ్యం పెంచితే ఎన్ని నీళ్లు తీసుకెళ్తున్నారనేది ఎవరు లెక్కిస్తారు. ఈఎన్​సీ మురళీధరరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకుంటే కేసీఆర్ ఆదేశాలతోనే ఇలా జరిగినట్లు భావించాల్సి ఉంటుంది.

-ఉత్తమ్ కుమార్ రెడ్డి

'అదే జరిగితే... దక్షిణ తెలంగాణ ఎడారైపోతుంది'

ఇవీ చూడండి: 'మోదీ ప్యాకేజీ భారీ శీర్షికతో కూడిన ఖాళీ పేజీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.