ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్యకాదని ప్రభుత్వ హత్యనేనని అఖిలపక్షం ఆరోపించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మందకృష్ణ మాదిగ, తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పడంతోనే మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని తెలిపారు.
"శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..." - all parties conference
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుపై అఖిలపక్షం మండిపడింది. ఆర్టీసీ డ్రైవర్‌ది ఆత్మహత్య కాదని... ప్రభుత్వ హత్యేనని ఆరోపించింది.
!["శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4738729-971-4738729-1570963587247.jpg?imwidth=3840)