ETV Bharat / state

'పోరాటాలు చెయ్యకపోతే బానిసల్లా బతకాలి' - బషీర్​బాగ్​లో రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్రంలోని 12 వేల పాఠశాలలను మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని అఖిల పక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేస్తానని చెప్పే అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదన్నారు.

party
రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Nov 26, 2019, 5:57 AM IST

ఎన్నికల్లో కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అని హామీలు ఇచ్చి... విద్యను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్​బాగ్​లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో... 'రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ బడుల మూసివేతను అడ్డుకుంటాం' అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వ్యాయామ, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కృష్ణయ్య కోరారు. విద్యను వ్యాపారం చేసేందుకు కేసీఆర్ పునాదులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని... ఆర్టీసీ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ ఆస్తులను అమ్ముకునేందుకు చర్యకు దిగుతున్నారని ఆరోపించారు.

పోరాటాలు చేయాల్సిందే..

ప్రజలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించాలని కోరారు. పోరాటాలు చెయ్యకపోతే మరో నిజాం పాలనలో బానిసల్లా బతకాలన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌళిక సదుపాయాలు కల్పించకుండా... విద్యా ప్రమాణాలు లేవని మూసివేయాలని చూస్తే... ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ డిమాండ్ చేశారు. పాఠశాలల మూసివేత వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని... మూసివేసే యోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశం

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.