ETV Bharat / state

సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం - All-Party Conference at Somajiguda

ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని అఖిల పక్ష నేతలు ఆరోపించారు. పట్టణాభివృద్ధి కోసమో.. భూముల క్రమబద్దీకరణ కోసమో ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకురాలేదని అన్నారు. ఎల్ఆర్‌ఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

All party leaders comment on LRS scheme
సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం
author img

By

Published : Sep 26, 2020, 9:13 PM IST

ఎల్‌ఆర్‌ఎస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దారి దోపిడీ చేస్తోందని అఖిల పక్షం నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 25 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేశారు.

సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం

ఇతర కులాలను బీసీ జాబితాలో కలపడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే రిజర్వేషన్లు పెంచకుండా ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్​ను పూర్తిగా రద్దు చేయాలని.. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : దసరా నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.