ETV Bharat / state

ఇంటర్​ అవకతవకలపై 11న అఖిలపక్షం దీక్ష

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని అఖిల పక్ష నేతలు ఆరోపించారు. ఈనెల 11న ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

అఖిలపక్షం దీక్ష
author img

By

Published : May 9, 2019, 4:05 PM IST

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలపై ఈనెల 11న ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు అఖిల పక్ష నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలను హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్థూం భవన్​లో ఆవిష్కరించారు. ప్రజలు దీక్ష విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు.

ఇంటర్​ అవకతవకలపై 11న అఖిల పక్షం నేతల నిరసన

అవి ప్రభుత్వ హత్యలే

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు మరణాలు ప్రభుత్వ హత్యలేనని సీపీఐ నేత సుధాకర్​ ఆరోపించారు. కేసీఆర్​కు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం సమస్య వచ్చినపుడు తప్పించుకునే ధోరణి కనబరుస్తుందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ విమర్శించారు. తప్పులకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.
విద్యార్థులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సి ఉందని అఖిలపక్ష నేతలు అన్నారు. విద్యా వ్యవస్థ విలువల్ని కోల్పోయే స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా..లేవా..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.