రోజుకు 4 గంటలు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఎన్నికల నియమావళిపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని కమిషనర్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దరావతుకు 25 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థి 70 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదని సూచించారు. రాజకీయ పార్టీలు చేపట్టే ఎన్నికల వ్యయంపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ఏర్పాట్లు
హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3 వేల 976 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. నూతన ఓటర్ల చేరికతో అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు అధికమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు నీడను కల్పించేందుకు ప్రత్యేకంగా టెంట్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:20 నుంచి అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మెట్రో