దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రం నుంచి 52 వేల 924 మంది ఉన్నారు. హైదరాబాద్, వరంగల్లో పరీక్ష జరుగనుంది. హైదరాబాద్‌లో 46 వేల 171 మంది అభ్యర్థుల కోసం 99... వరంగల్లో 6 వేల 753 మంది కోసం 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.
కరోనా కారణంగా వాయిదా..
ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు జనరల్ స్టడీస్ పేపర్ వన్.. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సీశాట్ రెండో పేపర్ నిర్వహిస్తారు. మే 31న పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. మార్చి చివరిలో శిక్షణా కేంద్రాలు మూతపడటం వల్ల.. అభ్యర్థులు ప్రిపరేషన్‌కు కొంత ఇబ్బంది పడ్డారు. ఈ పరీక్ష ఫలితాలు నెల రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎంసెట్ అగ్రికల్చరల్ పరీక్ష ప్రాథమిక సమాధానాలు విడుదల