ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలం క్రితం మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లారు. చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్య క్షీణించింనట్లు మజ్లిస్ అధినేత, అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం వెల్లడించారు. అక్బరుద్దీన్ కోలుకోని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని అసద్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొన్నేళ్ల క్రితం చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి అక్బరుద్దీన్ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: 'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయండి'