Air Show in HYD: రాజధాని హైదరాబాద్‌లో ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం సైనిక విమానాల విన్యాసాలు జరగనున్నాయి. చేతక్ హెలికాప్టర్ 60 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా విన్యాసాలను భారత వాయుసేన ఏర్పాటు చేసింది. హకీంపేటలో జరిగే వేడుకలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విన్యాసాలను మధ్యాహ్నం 1.17 గంటలకు వీక్షిస్తారు. పక్కపక్కనే తొమ్మిది హ్యాక్ ఎంకే 132 విమానాలతో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ యాక్రోబాటిక్ బృందం విన్యాసాలు చేయనుంది. నగరంలోని పర్యాటక ప్రదేశాలు గోల్కొండ కోట, ఫలక్‌నుమా, చార్మినార్, హుస్సేన్‌సాగర్‌ను 21 నిమిషాల్లో ఆ బృందం చుట్టేయనుంది.
షెడ్యూల్ ఇదే..
- మధ్యాహ్నం 1.09 గంటలకు దుండిగల్ విమానాశ్రయం నుంచి ప్రారంభం
- 1.17 గంటలకు హకీంపేట
- 1.18 గంటలకు బేగంపేట విమానాశ్రయం
- 1.19 గంటలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి
- 1.23 గంటలకు గోల్కొండ కోట
- 1.24 గంటలకు అప్పా
- 1.28 గంటలకు ఫలక్‌నుమా
- 1.29 గంటలకు చార్మినార్
- 1.30 గంటలకు హుస్సేన్‌సాగర్
ఇదీ చదవండి: