ETV Bharat / state

6 స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్​ ఓవైసీ - asaduddin owisi latest comments

AIMIM Party Candidates List : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించింది. 9 స్థానాల్లో పోటీ చేయనున్న ఎంఐఎం.. 6 అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. బహదూర్​పూరా, జూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

AIMIM  Party-MLA Candidates-List
AIMIM Party Candidates List
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 3:18 PM IST

Updated : Nov 3, 2023, 4:07 PM IST

AIMIM Party Candidates List : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM) పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. (AIMIM MLA Candidates) చంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్​ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్​, చార్మినార్​ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్​, యాకత్​పురా నుంచి జాఫర్​ హుస్సేన్ మిరాజ్ పోటీ చేయనున్నారు. మలక్​పేట నుంచి అహ్మద్​ బలాల, కార్వాన్​ నుంచి కౌసర్​ మొయినుద్దీన్ పోటీ చేస్తారని తెలిపారు. బహదూర్​పూరా, జూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఒకటి రెండు రోజల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సిట్టింగ్​ ఎమ్మల్యేలైనా పాషా ఖాద్రీ, ముంతాజ్​ హేమంత్​ ఖాన్​ ఈసారి ఎన్నికల బరిలో నిలబడటం లేదని తెలిపారు. తాము పోటీ చేయబోయే ప్రతి స్థానంలో గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.

సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి
1చంద్రాయణ గుట్ట అక్బరుద్దీన్​ ఓవైసీ
2నాంపల్లి మాజీద్ హుస్సేన్
3చార్మినార్జుల్ఫికర్
4యాకత్​పురా జాఫర్​ హుస్సేన్ మిరాజ్
5మలక్​పేటఅహ్మద్​ బలాల
6కార్వాన్కౌసర్​ మొయినుద్దీన్

'బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తమవి లౌకిక పార్టీలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారు. బాబ్రీ మసీదు విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అందరికీ తెలుసు. బాబ్రీ మసీదు ఘటనలో ఒక్క కాంగ్రెస్ నేతకూ శిక్ష పడలేదు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) , కమలానాథ్.. నాటకాలు ఆడుతున్నారు. భారత్ జోడో పేరుతో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. 60 ఏళ్లుగా దేశంలో, రాష్ట్రాల్లో పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా?'. అని అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు.

'ఎన్నికల్లో ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటు వేయొద్దు'

Asaduddin Owaisi Comments on BJP And Congress : బీజేపీ, కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి ప్రధానీ మోదీ వెంట కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీని తీసుకెళ్లాలను డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు మొత్తం అంశంలో బీజేపీ కాంగ్రెస్​ల పాత్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్​ హయాంలో అనేక సార్లు కర్ఫ్యూ విధించారని మండిపడ్డారు. 1990 నుంచి 2012 వరకు 113 సార్లు కర్ఫ్యూలు విధించారని పేర్కొన్నారు. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణలో భైంసా రాత్రి వేళల్లో ఒకసారి.. కోవిడ్​లో మరోసారి విధించారని తెలిపారు. అందులో తెలుస్తుంది రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నయన్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఎంఐఎం ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈసారి తప్పకుండా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: ఓవైసీ

Minister KTR Response: అసదుద్దీన్​పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్​

Last Updated : Nov 3, 2023, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.