ETV Bharat / state

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ

author img

By

Published : May 26, 2021, 6:02 PM IST

నల్ల చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో బ్లాక్ డే నిర్వహించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంతవరకు ఐక్యంగా పోరాడుదామని ఏఐకేఎస్​సీసీ నాయకులు టి సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య చెప్పారు.

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ

హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లిలో ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని ఏఐకేఎస్​సీసీ నాయకులు టి.సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్​ చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోలన్నారు.

పేద రైతులను ఆదుకునేందుకు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని 6 వేల నుంచి 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని గోల్కొండ క్రాస్ రోడ్డులో బ్లాక్ డే నిర్వహించారు.

ఇదీ చదంవడి: బంగాల్​లో 'యాస్'​ కల్లోలం- నీట మునిగిన ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.