దేశంలో ఇప్పటి వరకు 24 రకాల పంటలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వర్తిస్తుందని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకే పండ్లు, కూరగాయలను... స్థానికంగా ఉన్న వ్యవసాయ సహకార సంఘాలు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆపదకాలంలో పండిన పంటలను విక్రయించుకునే పరిస్థితి లేదని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పండ్లు, కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు అవసరమైన శీతలీకరణ ఉపకరణాలు అందించాలని కోదండ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.