రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని ఏఐసీసీ నియమించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో పలువురు సీనియర్ నాయకులను సభ్యులుగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.
ఈ కమిటీలో సభ్యులుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించింది. తెలంగాణ నుంచి ఎంపికైన ఏఐసీసీ సభ్యులు, కార్యదర్శులుగా ఎంపికైనవారు, పలు కమిటీల ఛైర్మన్లను సభ్యులుగా ఎంపిక చేసింది.
సభ్యులుగా సీనియర్ నాయకులు
ఈ కమిటిలో సభ్యులుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: REVANTH REDDY: గజ్వేల్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ'ను సక్సెస్ చేయాలి