ETV Bharat / state

అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా...

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆవేదన కలిగిస్తున్నాయి. వరుణుడు ముఖం చాటేయడం వల్ల కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఈ నెల 23న వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్​ జయశంకర్​ వర్శిటీ, క్రీడా ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడమా...? లేక స్వల్పకాలిక పంటలు సాగు చేయాలా...?  అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి
author img

By

Published : Jul 20, 2019, 4:18 AM IST

Updated : Jul 20, 2019, 6:34 AM IST

ప్రత్యామ్నాయ విధానాలపై నిపుణులతో సమావేశం

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నైరుతి రుతు పవనాలు రాక ఆలస్యం కావడం... లోటు వర్షపాతం వెరసి 29 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కరవు ఛాయలకు అద్దం పడుతోంది. ఏకంగా 433 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాజధానిలో వర్షాభావం, కరవు పరిస్థితులపై వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ, క్రీడా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై అధికారులు, శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

చినుకు జాడేదీ...?

ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం ఆరంభం నుంచి చినుకు జాడ లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యవసాయ పంటలన్నీ ఎండిపోతున్నాయి. కళ్లెదుటే పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, ఇతర పైర్లు ఎండిపోతుండటం చూసి అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. సాధారణంగా జూన్​ 1 నుంచి ఇవాళ్టి వరకు 242.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 155.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 309.7 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 59.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 27 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులుండగా... నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నదాతల్లో ఆందోళన

రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 43 లక్షల 34 వేల 487 హెక్టార్లు ఉండగా... 26 లక్షల 03 వేల 923 హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. 52 శాతం విస్తీర్ణంలో పంటల సాగు పూర్తవగా మిగతా పైర్ల సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా విపత్కర పరిస్థితులపై వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ వర్శిటీ, క్రీడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలా...? లేక స్వల్పకాలిక పంటల సాగు ప్రోత్సహించాలా...? అనేది తుది నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ కమిషనర్​ రాహుల్​ బొజ్జ వెల్లడించారు.

రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలు

రైతుల సౌకర్యార్థం... త్వరలో రుణమాఫీ పథకం అమలుకు మార్గదర్శకాలు వెలువరించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​కు సంబంధించి రైతుబంధు పథకం కింద రూ. 6,500 కోట్లు ప్రొసీడింగ్స్​ ఇవ్వగా... ఆర్థిక శాఖ నుంచి 58 శాతం వరకూ నిధులు విడుదలయ్యాయి. మిగతా నిధులు కూడా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ రుణాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి సూచించింది. క్షేత్రస్థాయిలో కర్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి : ముగిసిన సమావేశాలు... 5 బిల్లులకు ఆమోదం

Last Updated : Jul 20, 2019, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.