ETV Bharat / state

మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్​ రెడ్డి - మంత్రి నిరంజన్​రెడ్డితో ముఖాముఖి

రాష్ట్రంలో పంటకోతలు దాదాపు అయిపోయాయి. పండ్లతోటలు, కూరగాయల పంటలు అక్కడక్కడ కొంతమేరకు ఉన్నాయి. మిడతలొస్తే వీటికి నష్టం జరిగే అవకాశముంటుంది. ఈ సమయానికి సాధారణ పంటలు లేకపోవడం కలసొచ్చే అంశం. గాలి పయనం మనవైపు లేదు, వాతావరణంలో భారీ మార్పులొచ్చి ఏమైనా జరిగితే తప్ప అవి మన రాష్ట్రంలోకి వస్తాయనుకోవడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి.

agriculture minister niranjanreddy interview
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డితో ముఖాముఖి
author img

By

Published : Jun 1, 2020, 6:13 AM IST

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డితో ముఖాముఖి

రాష్ట్రానికి పొంచి ఉన్న మిడతల ముప్పును ఎదుర్కోవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. శాస్త్రవేత్తల ద్వారా వాటి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిడతల జాతీయ హెచ్చరికల కేంద్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పిందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారీకి సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు... డ్రోన్లు, రసాయనాలు, యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నాయన్నారు. మిడతల దండు వ్యాప్తి, జూన్‌ నుంచి కొత్త వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ ప్రారంభం కానుండటం, నియంత్రిత పంటల సాగు విధానం అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడారు.

ప్రశ్న: మిడతలు తెలంగాణలోకి ప్రవేశిస్తే పంటనష్టం అధికంగా ఉంటుంది. ఎలా నియంత్రిస్తారు.?

జవాబు: వ్యక్తులుగా, రైతులుగా వాటిని ఎవరికివారు ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి. వందేళ్ల క్రితం ఇవి అలాగే రావడం వల్ల ‘మిడతల దండు’ అనే సామెత పుట్టింది. నియంత్రించలేనంతగా విప్లవ పోరాటాలు జరిగినప్పుడు, ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు మిడతల దండులా వచ్చారనే సామెత వీటివల్లనే అప్పట్లో పుట్టింది. తెలంగాణలో ఇప్పుడు వరి, మొక్కజొన్న సాధారణ పంటలు లేవు. కొన్ని తోటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా 90 శాతం కోతలు పూర్తయ్యాయి. మిడతలు ఆకులన్ని తినేస్తాయి. వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాం.

ప్రశ్న: వాతావరణ మార్పుల వల్లనే వీటి వ్యాప్తి అధికంగా ఉంటుందంటున్నారు ?

జవాబు: వాతావరణ మార్పులు అనేది ఒక్కటే ఒక అంశం కాదు. మిడతలను పలు దేశాల ప్రభుత్వాల నియంత్రించలేకపోతున్నాయి. ఉదాహరణకు కరోనా ఏ దేశ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. జాగ్రత్తలు తీసుకోవడం తప్ప. వందేళ్ల క్రితమే మిడతల దండు వచ్చిందని పూర్వీకులు చెపుతున్నారు. ఇప్పుడైతే గాలి, నీరు కలుషితమైంది. వందేళ్ల క్రితం కలుషితం కాలేదు. మరి అప్పుడు మిడతలు ఎందుకొచ్చాయి. ప్రకృతి పరంగా ఒక్కోసారి ఒక్కో ప్రాణి దాని పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఫలానాదేశంలో వాతావరణంలో బాగా లేనందున అవి వచ్చాయని చెప్పలేదు. వాటికి ఆహారం కొరత ఏర్పడినప్పుడు గాలివాటంగా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రశ్న: నేటి నుంచి వానాకాలం సీజన్‌ మొదలైంది. పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సన్నద్ధమైంది?

జవాబు: వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఈసారి సగటు వర్షపాతం ఉంటుందని చెప్పడం సానుకూల అంశం. జూన్‌లో రుతుపవనాలతో వర్షాలు మొదలైనా తొలి వర్షం తరవాత విత్తనాలు వేశాక మళ్లీ కొంతకాలం వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాము. వానాకాలంలో పంటల మార్పిడి ప్రణాళిక తయారుచేస్తున్నాము.

ప్రశ్న: సీఎం కేసీఆర్​ తీపికబురు చెపుతాం అన్నారు ఏమిటది ?

జవాబు: అది ముఖ్యమంత్రి నోటి వెంట వింటేనే బాగుంటుంది.

ప్రశ్న: రైతుబంధు అందరికీ ఇస్తారా? ఏమైనా కోతలు పెడతారా? నియంత్రిత పంటలు వేస్తేనే ఇస్తామంటున్నారు. ఇది నిజమేనా? ఎప్పుడిస్తారు.?

జవాబు: రైతుబంధు పథకంలో ఎలాంటి కోతలు పెట్టే ఆలోచన లేదు. అందరికీ త్వరలో ఇస్తాం. పత్తి, వరి, కంది మాత్రమే కాకుండా ఇతర పంటలు వేసేవారికి కూడా ఇస్తాము. ప్రతిపక్షాలు వారి అవగాహన మేరకు మాట్లాడుతున్నాయి. దానిపై స్పందించాల్సిన అవసరం లేదు. రైతుబంధు పంట వేయడానికి ముందే ఇస్తాం. వందమందిలో 10 మంది పంట వేయకపోయినా వారికి ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోలేదు. ఎలాంటి పరిమితులు పెట్టడం లేదు. వ్యవసాయ భూములను రియల్​ఎస్టేట్‌కు గానీ... పారిశ్రామిక అవసరాల కోసం గానీ మారిస్తే వాటికి రైతుబంధు సాయం నిలిపివేస్తాం.

ప్రశ్న: నియంత్రిత పంటల సాగు విధానం తెస్తున్నారు. మరి వరి పంటలో సన్నరకాల విత్తనాలు ఉన్నాయా?

జవాబు: సన్నరకాల విత్తనాలకు కొరత లేదు. జిల్లావారీగా వివరాలు సేకరించి పంపాము. ఈ సీజన్‌లో తెలంగాణ సోనా 10 లక్షల ఎకరాలకు పెంచమని చెప్పాము. మార్కెట్‌లో లేని వంగడాలను వేయమని చెప్పలేదు.

ప్రశ్న: సన్నరకాల ధాన్యం దిగుబడి, ధర తక్కువగా ఉంది... రైతులకు నష్టం వస్తుందంటున్నారు కదా ?

జవాబు: ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రైతులు నష్టపోకుండా లావురకాలకు సమానంగా సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వాలనే అంశం గురించి సర్కారు పరిశీలిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. అధిక ధరలకే సన్నరకాల వడ్లను కొనేలా చూస్తాము.

ప్రశ్న: సోయాచిక్కుడు విత్తన కొరత ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.?

జవాబు: సోయా ఈసారి 4 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. విత్తనాల కోసం 2 నెలలుగా టెండర్లు పిలుస్తున్నాము. విత్తన కంపెనీలను అడుగుతున్నా ఎక్కడా అందుబాటులో లేవు. మహారాష్ట్రలో కోటి ఎకరాల్లో సోయా వేయాలని చూస్తున్నందున విత్తనాలకు కొరత ఏర్పడింది. దీనిపై జాతీయ విత్తన సంస్థతో మాట్లాడి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నాము.

ప్రశ్న: పత్తి సాగు బాగా పెంచాలని చెప్పారు. కానీ సీసీఐ ముందుకు రాకపోతే పత్తిని మద్దతు ధరకు కొనడం సాధ్యమేనా ?

జవాబు: అంతర్జాతీయ మార్కెట్ల అవసరాల దృష్ట్యా అంచనా వేసి పత్తి 70 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 65 లక్షల ఎకరాలు సాగవుతుందనుకుంటున్నాము. భారత పత్తి సంస్థ(సీసీఐ) తప్పకుండా కొంటుందనే అంచనాతోనే పత్తి సాగుచేయమని చెపుతున్నాం. సీఎంకు ఈ సమాచారం లేకుండా పత్తి వేయమని చెప్పరు కదా. జిన్నింగ్‌ మిల్లుల వారు కూడా పత్తిని కొంటామని చెప్పారు. కేంద్రం ఒక రాష్ట్రంతో ప్రేమతో వ్యవహరిస్తే అది ప్రభుత్వం కాదు. కేంద్రానికి కూడా పత్తి అవసరం. ఇతర రాష్ట్రాల్లో కూడా పత్తి కొనాలి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొని తెలంగాణలో కొనం అంటే జనం ఊరుకుంటారా...?

ప్రశ్న: తెలంగాణలో ఆహార పంటల సాగు తక్కువగా ఉంది. వంటనూనెలు ఇతర దేశాలు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాము. వీటి దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించేదెన్నడు ?

జవాబు: వేలాది ఎకరాల్లో పందిరి రకాల కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలను ఇస్తున్నాము. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు పెరిగింది. మొత్తం 21 రకాల్లో 11 రకాలు మనం ఎక్కువగా పండిస్తున్నాము. మిగిలిన 9 రకాల కూరగాయల కొరత ఉంది. వీటిని పెంచుకోవాలని పట్టుదలగా ఉన్నాము. కూరగాయలు, పండ్ల దిగుబడి పెంచుతాం.

ప్రశ్న: పంటల బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటీ ? ఈ సీజన్‌లో అమలుచేస్తారా?

జవాబు: రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. కానీ కేంద్రం మొత్తం స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. విధాన నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. గతంలో రైతు పంటరుణం తీసుకుంటే కచ్చితంగా ప్రీమియం బ్యాంకు తీసుకునేది. కానీ కేంద్రంపై భారం తగ్గించుకోవాలని కేంద్రం ఈ సీజన్‌ నుంచి దానిని ఐశ్చికంగా మార్చింది. దీనివల్ల రైతులకు తెలియక దానికి దూరమవుతారు. బాధ్యతకలిగిన సార్వభౌమ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఈ రకంగా ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదు. ఈ పథకంపై ఒక రాష్ట్రంగా మనం నిర్ణయం తీసుకోలేం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పోయే డబ్బులో చాలా తక్కువగా వెనక్కి వస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి 35 పైసలు వెళ్తే రూపాయి వెనక్కి ఇస్తున్నారు. కానీ మన నుంచి రూపాయి వెళ్తే సగటున 30 పైసలు వస్తోంది. ఇది రాష్ట్రాల ఆర్థికశక్తిని హరించేలా ఉంది.

ప్రశ్న: కంది కూడా 15 లక్షల ఎకరాల్లో వేయమంటున్నారు. కానీ కేంద్రం కొనకపోతే రాష్ట్రం తరపున మొత్తం పంట కొంటారా?

జవాబు: పంట కొనుగోలు విషయంలో కేంద్రం గురించి మేం ఆలోచించడం లేదు. కేంద్రాన్ని నమ్ముకుంటే నట్టేట ముంచుతున్నారు. తెలంగాణ రాష్ట్ర శక్తియుక్తుల ఆధారంగానే ముందుకెళ్తాం. మా నిర్ణయం ఏదో మేం తీసుకుంటాం. ప్రజలకు ఏడాది పొడవునా కందిపప్పు అవసరం ఉంటుంది. పంట కొని ప్రజలకు విక్రయిస్తాం. మిగిలితే ఇతర రాష్ట్రాలకు అమ్ముతాం. కేంద్రంపై నమ్మకం పెట్టుకుని మీరు కొనండని పదే పదే వారిని అడగలేం.

ప్రశ్న: పసుపు పంటకు ధర లేదని రైతులు నష్టపోతున్నారు. దీనిపై మీ సమాధానం. ?

జవాబు: ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ప్రాతిపదిక లేకుండా ఎలా మాట్లాడతారో అలా కేంద్రం కూడా వ్యవహరించవచ్చా ? పసుపు బోర్డు ఇవ్వకుండా ఇచ్చామని కేంద్రం చెప్పడం సబబేనా ? ఈ విషయం రైతులకు కూడా అర్థమవుతోంది. ఎప్పుడో ఒకసారి మంచిధర వస్తుందని రైతులు పసుపు సాగు చేస్తున్నారు.

ఇదీ చూడండి: జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.