Niranjan reddy Warangal Tour : ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆయన సూచన మేరకు మంత్రులు, వ్యవసాయ అధికారులు మంగళవారం పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడతారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలసి.... వరంగల్‌కు చేరుకుంటారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 10.30 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. ప్రధానంగా పరకాల, నర్సంపేట మండలాల్లోని వానలకు దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలను పరిశీలిస్తారు.
మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి దుగ్గొండి మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తారు. వర్షాలకు నష్టపోయిన మిరప రైతులను కలుసుకుంటారు. రైతులు, అధికారులతో మాట్లాడి... పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇదీ చదవండి: Mirchi farmers problems: మిర్చి రైతుపై వరుణుడి పంజా.. అకాల వర్షాలతో నష్టాలు