సాగు నీటి వసతి పెరగడం, వ్యవసాయ పథకాలతో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు పెరిగాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (agriculture minister niranjan reddy) వివరించారు. గతేడాది వానాకాలం(rainy season), యాసంగిలో రెండూ కలిపి రూ.41,240 కోట్ల విలువైన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు(niranjan reddy on crop in council session). ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు అవగాహన లేకుండా ప్రాజెక్టులు, పంటల సాగుపై విమర్శలు చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మించారని, వాటిని ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటామన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా సాగునీటి కల్పనతో పాటు భూగర్భజలాలు, మత్య్స సంపద పెరుగుతాయని వివరించారు. ఆరుతడి పంటలకు కూడా సాగునీరు అవసరమని, ప్రాజెక్టు కడితే వరిపంట సాగుకే అనుకోవడం అవగాహనా రాహిత్యమని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో చైతన్యం కల్పించాలి
మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌తో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో పండిన పంట దేశంలోని అనేక రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతుందని (export) వివరించారు. దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు మేలు జరిగేలా సభలో సుధీర్ఘ చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నూనె, పప్పుగింజల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. రైతువేదికల(raithu vedika) ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తీసుకురావడం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలని, అందలో వేరుశెనగ పంట పెద్ద ఎత్తున సాగు చేయాలని చెబుతున్నామని వివరించారు.
భారత దేశంలో యాసంగిలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఏ ప్రాజెక్టు కట్టినా దాని ఉద్దేశం కేవలం వరి పండించడమే కాదు. వరికోసమే ప్రాజెక్టు అనుకోవడం అది అవగాహన రాహిత్యం. ప్రాజెక్టు వల్ల వరి సేద్యం జరుగుతుంది. యాసంగి వస్తే మెట్ట పంటలకు నీరందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల్లో ఆంధ్ర పాలకుల కుట్ర ఎటువంటిదంటే... తెలంగాణలో వరి అవసరమున్నప్పటికీ వాటికి ఐడీ క్రాప్స్ అని పెట్టారు. నీటిని హేతుబద్ధంగా వాడుకునేదానిలో భాగంగానే ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నాం. నూనెగింజలను, ఆయిల్పామ్లను ప్రోత్సహిస్తున్నాం.
- నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇదీ చూడండి: ktr on industrial sector: కట్టుకథలతో పరిశ్రమలు రావు.. కఠోర శ్రమతోనే సాధ్యం: కేటీఆర్